Amaravati, ఏప్రిల్ 26 -- ఏపీ క్యాపిటల్ రీజియన్ అథారిటీ (ఏపీసీఆర్డీఏ) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా ఎన్విరాన్ మెంటల్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు పోస్టులు ఖాళీలు ఉండగా... వీటిని కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లేదా ఎన్విరాన్ మెంటర్ ఇంజినీరింగ్ లో లో పీజీ చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంబంధింత విభాగంలో 10 ఏళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు ఎంఎస్ ఆఫీస్ పై మంచి అవగాహన ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్థులు విజయవాడలోని ఏపీ సీఆర్డీఏ పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏడాది కాలానికి రిక్రూట్...