భారతదేశం, జనవరి 1 -- కొత్త సంవత్సరం వేళ 22ఏ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రైవేటు భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూముల పత్రాలుంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు.

స్వాతంత్ర్య సమరయోధుల భూములను కూడా 22ఏ నుంచి తొలగించాలని. రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22ఏ నుండి తొలగించాలని మంత్రి అనగాని పేర్కొన్నారు. భూ కేటాయింపుల కోస...