భారతదేశం, ఏప్రిల్ 27 -- కూటమి ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ-117ను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా 9 రకాల పాఠశాలలు తీసుకురాబోతుంది. ఇందుకు సంబంధించి అధికారులు ప్రాథమిక జాబితాను రూపొందించారు. ఇప్పటి వరకు ఉన్న 6 రకాల బడులు స్థానంలో మరో మూడు జోడించి 9 రకాల బడుల విధానం అమలు చేయనున్నారు.

ఉన్నత పాఠశాలలో 4 రకాలు, ప్రాథమిక పాఠశాలల్లో 45 మంది లోపు ఉంటే బేసిక్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా పిలుస్తారు. 45 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే తరగతికొక టీచర్‌ను కేటాయిస్తారు. వీటిని ఆదర్శ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా పిలుస్తారు. 1-10 తరగతులుంటే బేసిక్, ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 900 వరకు ఏర్పాటు చేయనున్నారు.

కొన్ని ప్రాథమికోన్నత స్కూల్స్, ఇంటర్మీడియట్‌తో కలిపి హైస్కూల్‌ ప్లస్‌లుగా కొనసాగిస్తారు. క్షేత్రస...