భారతదేశం, డిసెంబర్ 5 -- రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల నాలెడ్జీ అద్భుతంగా ఉందని. త్వరలో వాళ్ల నుంచే తాను నేర్చుకునే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు.

" విద్యలో పిల్లల బలాబలాలు తెలుకునేందుకు... దానికి అనుగుణంగా విశ్లేషించుకుని స్కై, మౌంటెన్, స్టీమ్ అనే మూడు వర్గాలుగా వర్గీకరించారు. క్లిక్కర్ అనే విధానం పిల్లలను మరింత ఆసక్తిగా చదువుకునేలా చేస్తోంది. నేను అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉంది. పిల్లలు కూడా వాటిని అందిపుచ్చుకుంటున్నారు పరీక్షలు జరిగిన తర్వాత సమర్ధత తెలుస...