Andhrapradesh, జూలై 3 -- ఏపీ ఈఏపీసెట్ - 2025 అభ్యర్థులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఇందులో భాగంగా జూలై 4వ తేదీన పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూలై 7 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు జూలై 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూలై 22వ తేదీన సీట్లను కేటాయిస్తారు.

ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు మే 19 నుంచి మే 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహించారు. మే21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. మే 27న అగ్రికల్చర్‌, ఫార్మసి ప్రాథమిక కీని విడుదల చేశారు. మే 28వ తేదీన ఇంజినీరింగ్ ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. మే 30వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ ప్...