Andhrapradesh, అక్టోబర్ 3 -- ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం ఏపీ ప్రభుత్వం వాహనమిత్ర స్కీమ్(ఆటో డ్రైవర్ సేవలో)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియటంతో పాటు అర్హుల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే వీరందరికీ రేపు(అక్టోబర్ 4) డబ్బులను అందజేయనున్నారు.

ఈ స్కీమ్ కింద అర్హత ఉన్న డైవర్ల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులను జమ చేస్తారు. ఈ స్కీమ్ ను రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు కూటమి సర్కార్ లోని కీలక నేతలంతా పాల్గొంటారు. ఇందుకోసం ఏర్పాటన్నీ పూర్తయ్యాయి.

నిజానికి దసరా రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన డబ్బులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ తేదీని ప్రభుత్వం మార్చింది. ఇందులో భాగంగా రేపు డబ్బులను జమ చేయనున్నా...