భారతదేశం, డిసెంబర్ 24 -- ఏపీ వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గుంతకల్లు - మార్కాపుర్ మధ్య డైలీ ప్యాసింజర్ రైలును ప్రకటించింది.ప్రతీ రోజూ ప్రయాణించే ఈ రైలు నంద్యాల మీదుగా వెళ్లనుంది. ఈ ట్రైన్ సేవలు త్వరలో అందుబాటు లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

గుంతకల్లు - మార్కాపుర్ (ట్రైన్ నెబంర్ 57407) మధ్య రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ రైలు. సాయంత్రం 5.30 గంటలకు గుంతకల్లు నుంచి బయల్దేరి. రాత్రి 11.30 గంటలకు మార్కాపుర్ రోడ్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఇది మధ్యలో నంద్యాలలో రాత్రి 8.30కి ఆగనుంది.

అంతేకాకుండా మార్కాపుర్ రోడ్ నుంచి గుంతకల్లుకు (ట్రైన్ నెంబర్ 57408) మధ్య ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇది మార్కాపూర్ రోడ్ నుంచి ఉదయం 10.30కు బయలుదేరుతు...