భారతదేశం, ఏప్రిల్ 21 -- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి)ని సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కసిరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన రాజ్ కసిరెడ్డిని ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడకు తరలిస్తున్నారని సమాచారం. రేపు సిట్ పోలీసుల ముందు విచారణకు హాజరవుతానని రాజ్ కసిరెడ్డి ఓ ఆడియో విడుదల చేశారు.

మరోవైపు లిక్కర్ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్‌ కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు సమ్మతించలేదు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది. ఈ క్రమంలో మంగళవారం సిట్ విచారణకు హాజరవుతానని రాజ్‌ కసిరెడ్డి ఆడియో రిలీజ్ చ...