భారతదేశం, మే 13 -- ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో గోవిందప్పి ఏ33గా ఉన్నారు.

ఏపీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలంటూ సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్ 3 రోజుల క్రితం నోటీసులు ఇచ్చింది.

విజయవాడ కమిషనరేట్‌లోని సిట్‌ ఆఫీసులవో గత ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఈ ముగ్గురికి నోటీసులు అందజేశింది.

ఈ ముగ్గురు నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు హాజరుకాలేదు. దీంతో వీరికోసం గాలింపు చేపట్టిన సిట్ అధికారులు గోవిందప్ప మైసూరులో ఉన్నారన్న పక్కా సమాచారంతో...