భారతదేశం, జూలై 19 -- ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి సీజర్లు లేవన్నారు. ఈ కేసులో సాక్ష్యాలు కూా లేవన్న ఆయన. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

"ఈ అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటా. ఈ కేసుల నుంచి బయటపడతాను. నా పాత్ర పై ఆధారాలు ఉంటే చూపించండి. నా ఫోన్ లు మీకు ఇస్తా. దర్యాప్తుకు సహకరిస్తా. సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు పెట్టారు ముందుగానే ఒక వ్యక్తిని జైల్లో వేయాలని నిర్ణయించుకుని. ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని నయానో... భయానో ఒప్పించి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. ఈ కేసులో ఎలాంటి సీజర్లు లే...