Andhrapradesh, జూలై 19 -- ఏపీ లిక్కర్ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సిట్. ఇవాళ వైసీపీ లోక్ సభ సభ్యుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణం కేసు జరిగిందన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తోంది.

మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇవాళ మిథున్ రెడ్డిని కొన్ని గంటల పాటు విచారించింది. రాత్రి 7.30 గంటలకు విజయవాడలో అరెస్ట్ చేసింది. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు.

మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను కూడా సిట్ అరెస్ట్ చేసింది. అయితే ఇవాళ విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన మిథున్ రెడ్డిన...