Hyderabad,telangana, జూలై 30 -- ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏ40గా ఉన్న వరుణ్‌ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో సిట్‌ అధికారుల దాడులు చేపట్టారు.శంషాబాద్‌ మండలంలోని కాచారం ఫార్మ్‌ హౌస్‌లో తనిఖీలు చేపట్టగా. అట్టపెట్టల్లో నిల్వ ఉంచిన రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఏ1గా ఉన్న రాజ్‌ కసిరెడ్డి ఆదేశాలతో వరుణ్‌, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఏ 40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా. మరికొన్ని అంశాలపై సిట్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇక డబ్బులు దొరిన ఫార్మ్ హౌస్. సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ బాల్‌రెడ్డి పేర్లపై ఉన్నట్లు గుర్తించారు.

వైసీపీ. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరల్ని పెంచేసింది.సంపూర్ణ మద్యం నిషేధం...