Andhrapradesh, సెప్టెంబర్ 6 -- మద్యం కుంభకోణం కేసులో ముగ్గురికి ఏసీబీ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. రూ.3,200 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మే 16న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేసింది.

ఇదే కేసులో బాలాజీ గోవిందప్పను మే 13న మైసూరులో అరెస్టు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో కీలక అధికారి కాగా, కృష్ణమోహన్ రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పనిచేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలు రిమాండ్ లో ఉండగా. పలుమార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరించబడ్డాయి.

తాజాగా వారి బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్న ఏసీబీ కోర్టు. ముగ్గురికి బెయిల్ మంజూ...