Andhrapradesh, సెప్టెంబర్ 14 -- ఏపీలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అయితే అధికారులు మరో కీలక అప్డేట్ ఇచ్చారు. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో. కౌన్సెలింగ్ గడువును పొడిగించారు.

ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గడువు సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగించారు. ఇక 9వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉండగా. 15వ తేదీతో ఈ ప్రాసెస్ ముగుస్తుంది.

కాలేజీల ఎంపిక కోసం సెప్టెంబర్ 12వ తేదీన వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈ తేదీని 17వ తేదీ వరకు పొడిగించారు. సెప్టెంబర్ 18వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 20వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

లాసెట్ కౌన్సెలింగ్ లో భాగంగా సీట్లు పొందే విద్యార్థులు సెప్టెంబర్ 12 నుంచి కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఇందుకు ఈనెల 24వ ...