Andhrapradesh, మే 30 -- ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లు, ఐదేళ్ళ లా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే లాసెట్‌ 2025 కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఎంట్రెన్స్ పరీక్ష హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. జూన్ 5వ తేదీన లాసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరగనుంది. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

ఏపీ లాసెట్ పరీక్షలను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. సీబీటీ విధానంలో ఉంటుంది. మొత్తం 3 సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ ఏ లో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి 30 మార్కులు కేటాయిస్తారు. ఇక పార్ట్ బీలో కరెంట్ ఎఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. మిగతా 60 మార్కులు భారత రాజ్యాంగం, లీగల్ అప్టిట్యూడ్ నుంచి అడుగుతారు.

ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ చూస్తే. రెండు సెక్షన్లు ఉంటాయి. లేబర్ లా, క్రైమ్స్ అండ్ టార్ట్, పబ్లిక్ అండ్...