Andhrapradesh, ఆగస్టు 29 -- యూరియా ఇబ్బందుల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ‌ శుభవార్త చెప్పింది. రైతుల ఇబ్బందుల దృష్ట్యా. కేంద్రంతో ప్రత్యేకంగా అత్యవసర చర్చలు జరిపి. యూరియా సరఫరాకు లైన్ క్లియర్ చేసింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. కేంద్ర వ్యవసాయ, ఎరువులు, రసాయనిక శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో గురువారం రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది.

రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు కేంద్రం సత్వరమే సానుకూలంగా స్పందించటంపై మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సెప్టెంబర్ 6వ తేదీనాడు రావాల్సిన యూరియా సరుకును వారం ముందుగానే రాష్ట్రానికి సరఫరా చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ పొటాష్ లిమిటెడ్ ( ఐ పి యల్) కంపెనీ ద్వారా ఈ ఎరువులను గంగవరం పోర్టులో దిగుమతి చేసుకుంటున్నట్లు గురువారం ఓ ప్రకటన ద్వారా ...