భారతదేశం, డిసెంబర్ 27 -- ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల రీసర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి అయింది. అంతేకాకుండా గతంలో ఉన్న పాసు పుస్తకాలను కూడా రద్దు చేయగా.. కొత్త వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇదే విషయంపై చాలా రోజులుగా కసరత్తు చేస్తూ వస్తోంది. ఇప్పటికే రీసర్వే పూర్తి అయిన భూములకు కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా కొత్త సంవత్సరం వేళ రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు గ్రామసభల ద్వారా వీటిని అందజేయనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది.

గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు(పీపీబీ) పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది....