Andhrapradeesh, జూలై 5 -- ఏపీ రైతులకు కొత్త పట్టాదార్ పుస్తకాలను అందజేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రీ సర్వే పూర్తయిన భూ యజమానులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆగస్టు నాటికి అందచేయాలని ఆదేశించారు. వెంటనే ముద్రణ పూర్తి చేసి 21.86 లక్షల మందికి తొలివిడతగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.

ప్రతి పట్టాదారు పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి భూ యజమాని తమ భూమి వివరాలు వ్యక్తి గతంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ఆధార్ కార్డు తో సమగ్ర భూ వివరాలు రావాలని.. తమ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలని చెప్పారు.

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ధరఖాస్తుల పరిష్కారంపై ప్రైవేటు టీంతో ఆడిటింగ్ చేయా...