భారతదేశం, నవంబర్ 2 -- రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. 2025-26 ఖరీఫ్ పంట కొనుగోళ్లను నవంబర్ 3(సోమవారం) నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు మరియు 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి "7337359375" వాట్సాప్ నంబర్‌కు "హాయ్" అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.

ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుండి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ఏడాది అనుభవంతో ఈసారి ముందుగానే నాణ్యమైన గోతాలు సిద్ధం చేసుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించ...