భారతదేశం, డిసెంబర్ 24 -- ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్ తెలిపింది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా సబ్సిడీపై గోధుమ పిండిని అందించనుంది. దీనికి రేషన్ కార్డుదారులు చెల్లించాల్సింది కేవలం రూ.20 మాత్రమే. జనవరి 1 నుంచి 20 రూపాయలకే కిలో గోధుమ పిండి జనాలకు అందనుంది. దీనితో మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే గోధుమ పిండి ప్రజలకు దొరుకుతుంది. పండుగ సమయంలో పేద ప్రజలు కూడా పిండి వంటలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ ఆలోచన చేసినట్టుగా అర్థమవుతోంది.

ప్రస్తుతం మార్కెట్లో కేజీ గోధుమ పిండికి రూ.40 నుంచి 70 వరకు ఉంది. ఇది కూడా సాధారణ క్వాలిటీ పిండికి మాత్రమే. ఇక టాప్ బ్రాండ్ల గోధుమ పిండికి కేజీకి రూ.100 వరకు అమ్ముతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ధరలు మరింత ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా పేదలు, కూలీలు, తక్కువ ఆదాయ వర్గ...