Andhrapradesh, సెప్టెంబర్ 12 -- రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 29,796 రేషన్ షాపుల ద్వారా తెల్లరేషన్ కార్డులదారులకు బియ్యం, తదితర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కానూరులోని సివిల్ సప్లైస్ భవన్ లో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోందని చెప్పారు. వృద్దులకు ఇళ్లకు వెళ్లి ఇస్తున్నామన్నారు.

అక్టోబర్ 31 వరకు మాత్రం ఉచితంగా నిర్ధేశించిన ప్రాంతాల్లో ఈ స్మార్ట్ కార్డులు అందిస్తామన్నారు. మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దు అవుతుందని కాని ఆ తర్వాత సచివాలయాలకు వెళ్లి సరైన సమాచారం ఇస్తే... మళ్లీ రేషన్ కార్డు యాక్టివేట్ అవుతుందన్నారు.

నాలుగు దశల్లో 1 కోటీ 45 లక్షల స్మార్డ్ కార్డుల పంపిణీ ఆయా రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల పేర్కొ...