భారతదేశం, నవంబర్ 8 -- ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రానివారికి కూడా వీటిని అందజేస్తున్నారు. కొత్తగా కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈకేవైసీ లేని కార్డులను పక్కన పెట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు రేషన్ పంపిణీ కేంద్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.

స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు. ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవీసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.

ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా. నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమ...