Andhrapradesh,amaravati, మే 28 -- ఏపీలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతోంది. ఓవైపు ఆన్ లైన్ లోనే కాకుండా. మనమిత్ర వాట్సాప్ లోనూ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే కొత్తగా స్మార్ట్ కార్డులను అందజేయనున్నారు. ఇదిలా ఉంటే రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది.
జూన్ 1 నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం, పంచదార, ఇతర రేషన్ సరకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఎండీయూ వాహనాలను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో. మండల కేంద్రాల నుంచి స్టాక్ ను రేషన్ షాపులకు తరలిస్తున్నారు. అంతేకాకుండా. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ డీలర్లు ఇంటికి తీసుకొచ్చి సరకులు సరఫరా చేస్తారని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.
Published by HT Digital Content Services with permission...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.