భారతదేశం, నవంబర్ 12 -- రాష్ట్రంలోని రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త వచ్చేసింది. పట్టణాల్లోని రేషన్‌ షాపుల్లో గోధుమపిండి కిలో రూ.18 చొప్పున పంపిణీ చేయనున్నారు. ఇందుకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.

ఇటీవలే ఇదే విషయంపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రకటన చేశారు. జనవరి 1 నుంచి కేజీ గోధుమ పిండి కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన గోధుమ పిండిని అందజేస్తామని వివరించారు. ఫలితంగా ప్రస్తుతం ఇస్తున్నవి మాత్రమే కాకుండా. జనవరి 1వ తేదీ నుంచి రేషన్ కార్డుదారులు రూ. 18 చెల్లించి కేజీ గోధుమ పిండిని కూడా పొందవచ్చు.

ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రానివారికి కూడా వీటిని అందజేస్తున్నారు. కొత్తగా కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నార...