భారతదేశం, మే 19 -- ఏపీ గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. 5,6,7,8 తరగతులతో పాటు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 25న కామన్‌ ఎంట్రన్స్‌టెస్ట్‌ నిర్వహించారు. వీటి ఫలితాలు గత వారం విడుదలయ్యాయి.

ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 25న నిర్వహించిన ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలు మే 15న విడుదల అయ్యాయి. పరీక్ష ఫలితాలను విద్యార్థులు ఇక్కడ క్లిక్‌ చేసి ద్వారా తెలుసుకోవచ్చు.

ఏపీ గురుకుల పాఠశాలల్లో 5, 6,7,8 వ తరగతులలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులకు అయా పాఠశాలలకు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులను వెబ్ సైటు ద్వారా మే 21వ తేదీ నుంచి తెలుసుకోవచ్చు. పాఠశాలల వారీగా ఎంపికైన విద్యార...