భారతదేశం, ఏప్రిల్ 19 -- ఆంధ్రప్రదేశ్‌ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో నియామకాల‌కు నోటిఫికేషన్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు మే 7ను ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో ఒక ఛైర్మన్, నలుగురి మెంబర్ పోస్టుల నియామకం చేయ‌నున్నారు. అందుకు ఏపీ మున్సిప‌ల్ అండ్ ప‌ట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఛైర్మన్‌కు 20 సంవ‌త్సరాల అనుభ‌వం ఉండాలి. స‌భ్యుల‌కు 15 సంవ‌త్సరాల అనుభవం ఉండాలి. ఆర్థిక, సామాజిక సేవ‌, పట్టణాభివృద్ధి, హౌసింగ్, న్యాయశాస్త్రం, మౌలిక స‌దుపాయాలు, టౌన్ ప్లానింగ్‌, వాణిజ్యం, అకౌంట్సెన్సీ, పరిశ్రమ, మేనేజ్‌మెంట్‌, రియల్ ఎస్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ప్రజా వ్యవహారాలు, పరిపాలన తదితర రంగాల్లో అనుభవం ఉండాలి. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకునేందుకు వ‌యో ప‌రిమితి 65 ఏళ్లుగా నిర్ణయించారు.

ఛైర్మన్‌, స‌...