Hyderabad, ఆగస్టు 3 -- ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోన్న సరికొత్త తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ మయసభ. ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఈ సిరీస్‌ను డైరెక్టర్ దేవ కట్టా, కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవల నిర్వహించిన మయసభ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు దేవ కట్టా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

దేవా కట్టా మాట్లాడుతూ .. "మా కోసం వచ్చిన మా డియర్ బ్రదర్ సాయి దుర్గ తేజ్‌కు థాంక్స్. మయసభ అనేది అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి? అనే కాన్సెప్ట్‌తో తీశాం" అని అన్నారు.

"ఈ కాన్సెప్ట్ నాకు చిన్నప్పటి నుంచీ మెదడులో కదులుతూనే ఉండేది. అయితే, శ్రీ హర్ష అనే వ్యక్తి నా వద్దకు వచ్చి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. అప్పుడు మొదలైందే ఈ 'మయసభ'" అని దేవ కట్టా చెప్పా...