భారతదేశం, మే 25 -- లిక్కర్ స్కామ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో కీలక వ్యవహరించిన నాయకులు, అధికారులను ప్రశ్నించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సహా మరికొందరిని అరెస్టు చేసింది. అంతకుముందు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. తాజాగా విజయసాయికి సంబంధించి సంచలన విషయం టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది.

లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు హాజరు కాబోయే ముందు రోజు సాయంత్రం.. విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ కీలక నేత టీడీ జనార్ధన్‌ను కలిసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీ జనార్ధన్, విజయసాయి రెడ్డి ఒకరి వెంట ఒకరు.. ఒక ఇంట్లోకి వెళ్లడం, ఆ తర్వాత ఎవరికి వారుగా బయటకు వచ్చి వేర్వేరు కార్లలో వెళ్లడానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...