భారతదేశం, ఏప్రిల్ 28 -- విద్యాశాఖ ద్వారా 16 వేల 347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సుమారు 6 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు సరైన ప్రణాళికతో చదివితే ఉద్యోగాన్ని సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలకు 40 రోజులు మాత్రమే ఉంది. ఈ సమయంలో పక్కా ప్రణాళికతో చదవాలని స్పష్టం చేస్తున్నారు.

1.జూన్‌ 6 నుంచి ప్రారంభమై జులై 6 వరకూ డీఎస్సీ పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో వీటిని నిర్వహిస్తారు.

2.ఎడ్యుకేషన్‌ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, ఎస్‌జీటీ కంటెంట్, మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు, స్కూల్‌ అసిస్టెంట్‌కు ఆరు నుంచి ఇంటర్‌మీడియట్‌ వరకూ ఉంటుంది.

3.ప్రణాళికాబద్ధంగా గత...