భారతదేశం, ఏప్రిల్ 20 -- ఏపీ మెగా డీఎస్సీ 2025 షెడ్యూల్ వచ్చేసింది. ఇందులో భాగంగా ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉదయం 10 గంటలకు పూర్తి వివరాలను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువస్తుంది. పోస్టుల పూర్తి వివరాలతో పాటు సిలబస్, ఎగ్జామ్ షెడ్యూల్ వివరాలను వెల్లడించనుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం విడుదల చేశారు. డీఎస్సీ షెడ్యూల్ లో తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 ఖాళీలు ఉండగా. జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు ఉన్నాయి.

అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599 ఉండగా.. స్కూల్‌ అసిస్టెంట్లు ఖాళీలు 7,487గా ఉన్నట్లు షెడ్యూల్ లో పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర...