Andhrapradesh,amaravati, ఏప్రిల్ 17 -- ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. వెంటనే నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించినప్పటికీ. పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇదే విషయంపై ప్రభుత్వం కూడా పలుమార్లు ప్రకటనలు చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు కొనసాగుతోందని. కోర్టు కేసుల వంటి అంశాలతో జాప్యం ఉండకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది.

వారం రోజులలోపు ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక విద్య టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను ఇందులో కాకుండా. వేరే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో గతంలో ప్రకటించిన మాదిరిగానే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్...