Andhrapradesh, మే 29 -- ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించి మరో అప్డేట్. రేపట్నుంచి(మే 30) హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈసారి ఈ మెగా డీఎస్సీకి 3,35,401 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోగా. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ పడుతున్నారు. ఈసారి మహిళలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. దాదాపు 2,03,647 మంది మహిళా అభ్యర్థులు, 1,31,754 మంది పురుషుల నుంచి దరఖాస్తులు అందాయి. డీఎస్సీ పోస్టులు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2678 పోస్టులు ఉండగా.. 39,997 మంది అభ్...