Andhrapradesh, మే 31 -- ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లు వచ్చేశాయ్. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వారి లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి వీటిని పొందవచ్చు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఏపీ మెగా డీఎస్సీలో భాగాగం.. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీకి 3,35,401 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోగా. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పరీక్షలు జూన్‌ 6 నుంచి ప్రారంభమై.. జులై 6వ తేదీతో ముగుస్తాయి.

ఏపీ డీఎస్సీ పరీక్షలో కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలను కూడా ఖరారు చేసింది. ఏపీలోనే కాకుండా.. తెలంగాణ,...