Andhrapradesh, ఆగస్టు 23 -- మెగా డీఎస్సీకి సంబంధించి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. శుక్రవారం రాత్రి మెరిట్ లిస్టులను విడుదల చేసింది. వీటిని అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచామని డీఎస్సీ-2025 కన్వినర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉన్న ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు రాష్ట్రస్థాయి, జోనల్‌ స్థాయిలో ర్యాంకులను ప్రకటించారు. అదే స్కూల్‌ అసిస్టెంట్, ఎస్‌జీటీలకు ఉమ్మడి జిల్లాల వారీగా ర్యాంకులు, స్కోర్‌ వివరాలను ప్రకటించారు.

పలు కేటగిరీ పోస్టులకు సంబంధించి జోన్‌ ఆఫ్‌ కన్సిడరేషన్‌లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత డీఎస్సీ లాగిన్‌ ఐడీల ద్వారా కాల్‌ లెటర్లు అందించనున్నారు. ఇదే విషయాన్ని డీఎస్సీ కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులు వారి వ్య...