Andhrapradesh,amaravati, ఏప్రిల్ 18 -- రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల గ‌రిష్ట వ‌యో ప‌రిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్ల‌కు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే క‌టాఫ్ తేదీగా 2024 జూలై 1ను నిర్ణ‌యించారు. వయోపరిమితి మించిపోయింద‌నుకున్న అభ్య‌ర్థుల‌కు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా అభ్యర్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ ఏప్రిల్ 7న రాసిన లేఖ‌లో డీఎస్సీ అభ్య‌ర్థుల వ‌యో ప‌రిమితి పెంచాల‌ని కోరారు. దీంతో ఈ అంశాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం క్షుణంగా ప‌రిశీలించి డీఎస్సీ నియామ‌కానికి సంబంధించిన జీవో నెంబ‌ర్ 6ను స‌డ‌లిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. స‌బార్టినేట్ స‌ర్వీస్ రూల్స్‌-19...