భారతదేశం, ఏప్రిల్ 20 -- ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మెగా డీఎస్సీలో రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. వీటిలో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు ఉండగా, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2259 పోస్టులున్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలను జిల్లా స్థాయిలో నియామకాల్లో భర్తీ చేస్తారు. బధిర, అంధుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోన స్థాయిల్లో భర్తీ చేస్తారు.

ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్-1 గా ఇంగ్లీష్ లా...