Andhrapradesh, ఆగస్టు 2 -- ఏపీలో త్వరలోనే కొత్త టీచర్ల రాబోతున్నారు. ఆ దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మెగా డీఎస్సీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయనుంది. తాజాగానే అన్ని సబ్జెక్టుల ఫైనల్ కీలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించరు. కాబట్టి. త్వరలోనే మెరిట్, సెలక్షన్ జాబితాలను ప్రకటించే అవకాశం ఉంది.

విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఫైనల్ కీ విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే మెరిట్ జాబితాలను ప్రకటిస్తామని పేర్కొంది. ఆగస్ట్ 1వ తేదీనే ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో.. ఈ వారం రోజుల వ్యవధిలోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితాలను ప్రకటించే అవకాశం ఉంది.

మెరిట్ జాబితాలను ప్రకటించిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండనుంది. ఆగస్ట్ 16వ తేదీ నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశ...