భారతదేశం, ఏప్రిల్ 21 -- ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫిషన్ ఎట్టకేలకు విడుదలైంది. దీంతో అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీని మరింత పెంచారు. అయితే.. ప్రణాళికబద్ధంగా చదివితే ఉద్యోగం సాధించడం సులువని నిపుణులు చెబుతున్నారు. డీఎస్సీలో విజయం సాధించడానికి సమగ్రమైన ప్రిపరేషన్ అవసరం అని స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

ముందుగా ఏపీ డీఎస్సీ పరీక్షా విధానం, సిలబస్‌ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మీరు దరఖాస్తు చేస్తున్న పోస్టును బట్టి పరీక్షా విధానం మారుతుంది. స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ విధానాలు వేర్వేరుగా ఉంటాయి. సిలబస్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రతి అంశానికి ఎంత వెయిటేజ్ ఉందో తెలుసుకొని మీ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకోవాలి.

సిలబస్‌ను అనుసరించి ఒక అధ్యయన ప్రణాళికను రూపొందించు...