భారతదేశం, మే 16 -- వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌‌లో మద్యం విక్రయాల్లో అక్రమాలపై సిట్‌ దర్యాప్తులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డిల బెయిల్‌ పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కేసు విచారణలో బెయిల్ మంజూరు చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలో తాము జోక్యం చేసుకోవడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని నిందితుల తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఆందోళన వ్యక్తం చేయడంతో వారిపై ఒత్తిడి చేయొద్దని దర్యాప్తు అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపే అంశం కావడంతో ఈ దశలో నిందితులకు...