భారతదేశం, ఏప్రిల్ 19 -- ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరిని కొనసాగిస్తారా.. కొత్త వారిని నియమిస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. పురందేశ్వరి 2024 ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెను తొలగించి.. వేరే వారికి బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. అయితే.. బీజేపీ విధానాల ప్రకారం.. అధ్యక్ష పదవిలో వరసగా రెండుసార్లు కొనసాగేందుకు వీలుంది.

ఈ నేపథ్యంలో.. మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలని పురందేశ్వరి కోరుతున్నారు. ఆమెతోపాటు.. బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు కూడా అధ్యక్ష పదవి రేసులో ఉంది. అటు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు ...