భారతదేశం, ఏప్రిల్ 20 -- ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అమ‌ల‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుద‌ల చేసింది. అలాగే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రవేశ పరీక్షలు లేకుండానే డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయ‌నున్నట్లు పేర్కొంది.

ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి కె.విజ‌యానంద్ జీవో నెంబ‌ర్ 4ను విడుద‌ల చేశారు. ఏపీ స్పోర్ట్స్‌ పాలసీ 2024-29 ప్రకారం ప్రతిభ గల క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గుర్తించిన క్రీడలలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంత‌ర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ), పోలీస్, ఎక్సైజ్, అటవీ శాఖల్లో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ రిక్రూట్మె...