భారతదేశం, నవంబర్ 26 -- రాష్ట్ర ప్రజలకు ఆప్కో మరోసారి శుభవార్త తెలిపింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతి వరకూ ఆప్కో షో రూమ్ ల ద్వారా 40 శాతం డిస్కౌంట్ కు చేనేత వస్త్రాలు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు.

మారుతున్న అభిరుచుల దృష్ట్యా ప్రజల్లోనూ చేనేత వస్త్రాల వినియోగంపై మక్కువ పెరుగుతోందని మంత్రి సవిత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ఆప్కో షో రూమ్ ల్లో చేనేత వస్త్రాలను 40 శాతం డిస్కౌంట్ పై విక్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు, వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో డిస్కౌంట్ అమ్మకాలు వచ్చే సంక్రాంతి వరకూ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిస్కౌంట్ లో అమ్మకాలతో అటు ప్రజలకు చేనేత వస్త్రాలను మరింత చేరువ చేసే అవకాశ...