భారతదేశం, సెప్టెంబర్ 28 -- అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారం మోపిందని, ఆ భారాన్ని కూటమి ప్రభుత్వం తగ్గిస్తోందని చెప్పారు. నవంబర్ నెల నుంచి ప్రతి యూనిట్‌పై 13 పైసలు తగ్గిస్తున్నామని, రానున్న రోజుల్లోనూ మరింత భారం లేకుండా చేస్తామని అన్నారు. ఆదివారం అమరావతి లోని క్యాంపు కార్యాలయంలో గొట్టిపాటి రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి రవి కుమార్ మాట్లాడుతూ...'జగన్ ప్రభుత్వం 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది. 2019లో తెలుగు దేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు తీర్చిదిద్దారు. కానీ జగన్ వచ్చాక 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు....