భారతదేశం, డిసెంబర్ 27 -- న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక పెన్షన్లను ఒక్క రోజు ముందుగానే అందించనుంది. అంటే జనవరి 1వ తేదీన కాకుండా. డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు డబ్బులను పంపిణీ చేయనున్నారు.

పెన్షన్లకు సంబంధించిన నగదును డిసెంబర్ 30వ తేదీనే బ్యాంకుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విత్‌డ్రా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా డీఆర్‌డీఏ పీడీలు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే చూసుకోవాలని సూచించింది.

ఏపీలో కూటమి సర్కార్ ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో పెన్షన్లు అందజేస్తోంది. ఈ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు తదితర సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా భద్రత కల్పిస్తోంది.

ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పి...