భారతదేశం, మే 8 -- ఏపీలో యూనివర్శిటీ క్యాంపస్‌ కాలేజీలు, అనుబంధ పీజీ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ గత నెలలో విడుదలైంది. మే 5వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియాల్సి ఉండగా దానిని మే 11 వరకు పొడిగించినట్టు ఎస్వీ యూనివర్శిటీ ప్రకటించింది.

ఏపీ పీజీసెట్ -2025 దరఖాస్తులను సమర్పించడానికి గడువును పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు సెట్ చైర్మన్ ఆచార్య అప్పారావు, కన్వీనర్ పీసీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ ఏడాది పీజీ సెట్‌ నిర్వహణ బాధ్యతలను ఎస్వీ యూనివర్శిటీకి అప్పగించారు. పీజీ సెట్‌కు మార్చి నెలాఖరులో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 5వ తేదీ వరకు ఉన్న గడువును 11వ తేదీ వరకు పొడిగింరు.

పీజీ సెట్‌కు రూ. 1000 అప...