Andhrapradesh, సెప్టెంబర్ 28 -- ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా. తాజాగా ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈనెల 29 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి.

ఏపీ పీజీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువు అక్టోబర్ 4వ తేదీతో పూర్తవుతుంది. ఈనెల 30 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 1వ తేదీ వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 5 వరకు వీటిని ఎంచుకోవచ్చు.

అక్టోబర్ 6వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. అక్టోబర్ 8వ తేదీన సీట్లను కేటాయిస్తారు.సీట్లు పొందే విద్యార్థులు అక్టోబర్ 8 నుంచి 11 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. అక్టోబర్ 8వ తేదీ నుంచే తరగతులు కూడా ప...