Andhrapradesh, సెప్టెంబర్ 11 -- ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే ఈ గడువు ఈనెల 15వ తేదీతో పూర్తవుతుంది. అర్హులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని... వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఉన్నత విద్యామండలి తెలిపిన వివరాల ప్రకారం.... కౌన్సెలింగ్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 15న ముగుస్తుంది. ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 16వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఈనెల 12వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈ గడువు ఈనెల 17తో పూర్తవుతుంది. ఈనెల 18వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులకు ఈనెల 20వ తేదీన సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన...