భారతదేశం, జూన్ 26 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 21,995 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా. 19,488 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఏపీ పీజీసెట్‌ -2025లో మొత్తం 88.6 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈఏడాది శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహించింది. మొత్తం 31 సబ్జెక్టుల్లో ప్రవేశాలకు జూన్‌ 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....