భారతదేశం, జూన్ 25 -- ఏపీలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్‌-2025 ఫలితాలు వచ్చేశాయి. ఈసారి మొత్తం 93.55 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఏపీ పీజీఈసెట్‌ - 2025లో భాగంగా.. 13 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 14,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 11,244 మంది అర్హత సాధించారు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు కానుంది.

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఏపీ పీజీఈసెట్ రిజల్ట్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు కింది విధంగా ఉంటాయి..

Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్...