భారతదేశం, ఏప్రిల్ 16 -- ఏపీలో పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్‌)-2025 అభ్య‌ర్థులకు రాష్ట్ర సాంకేతిక విద్యా మండ‌లి అప్‌డేట్ ఇచ్చింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు గుడువు ఏప్రిల్ 17 వ‌ర‌కు పొడిగించింది. అభ్య‌ర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరుతోంది. నోటిఫికేష‌న్‌ షెడ్యూల్‌ ప్రకారం మార్చి 12వ తేదీన ద‌ర‌ఖాస్తులు స్వీక‌ర‌ణ ప్రారంభించి, ఏప్రిల్ 15వ తేదీ వరకు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు గ‌డువుగా విధించారు.

పాలీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత పలువురు సాంకేతిక విద్యా మండలికి అభ్యర్థించడంతో గడువు పొడిగించారు. పాలిసెట్‌ ద‌ర‌ఖాస్తు చేయడానికి మ‌రో రెండు రోజులు గ‌డువును పెంచింది. దీంతో ఏప్రిల్ 17వ తేదీ వ‌ర‌కు ద‌రఖాస్తులు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 30 ప్ర‌వేశ ప‌రీక్ష ఉంటుంది. ప్ర‌వేశ‌ప‌రీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లోనే ఉంటుంది.

1.ఆన్‌లైన్ ద‌...